Heat Wave: నిప్పులకుంపటిలా ఏపీ... రేపు మరింత పెరగనున్న ఎండ తీవ్రత

  • ఏపీలో భగ్గుమంటున్న ఎండలు
  • గత కొన్నిరోజులుగా భానుడి విశ్వరూపం
  • 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతల నమోదు
  • ఠారెత్తిపోతున్న ప్రజలు
Heat Wave will continue in AP

ఏపీలో కొన్నిరోజులుగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గతంలో రెంటచింతల వంటి ప్రాంతాల్లోనే 44 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రత నమోదయ్యేది. ఇప్పుడు ఏపీలో చాలా ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో ఎండవేడిమి పెరిగిపోతోంది. అత్యధిక ఉష్ణోగ్రతలకు తోడు ఉక్కపోత కూడా ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. గత వారం రోజులుగా ఏపీ కోస్తా, ఇతర ప్రాంతాల్లో భానుడు విశ్వరూపం ప్రదర్శిస్తున్నాడు. 

ఈ క్రమంలో, రేపు (జూన్ 3) కూడా రాష్ట్రం నిప్పులకుంపటిని తలపిస్తుందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. శుక్రవారం నాడు రాష్ట్రవ్యాప్తంగా ఎండతీవ్రత పెరగనుందని తెలిపింది. 83 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, మరో 157 మండలాల్లో వడగాడ్పులు వీస్తాయని వివరించింది. ఈ మేరకు తీవ్ర వడగాడ్పులు వీచే 83 మండలాల జాబితాను కూడా పంచుకుంది.
.

More Telugu News