Ram: 'ది వారియర్' సెకండ్ సింగిల్ రిలీజ్ డేట్ ఖరారు!

  • రామ్ హీరోగా రూపొందిన 'ది వారియర్' 
  • ఫస్టు టైమ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్న రామ్ 
  • తెలుగు  .. తమిళ భాషల్లో నిర్మితమైన సినిమా
  • జులై 14వ తేదీన విడుదల   
The Warrior Movie Update

కొంతకాలంగా రామ్ మాస్ టచ్ ఉన్న కథలను చేయడానికి ఉత్సాహాన్ని చూపుతున్నాడు. అందువల్లనే తమిళంలో మాస్ డైరెక్టర్ గా పేరున్న లింగుసామిని రంగంలోకి దింపాడు. ఆయన దర్శకత్వంలో 'ది వారియర్' రూపొందింది. శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు. 

తాజాగా ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ ను రిలీజ్ చేయడానికి ముహూర్తాన్ని ఖరారు చేశారు. ఈ నెల 4వ తేదీన మధ్యాహ్నం 12:07 నిమిషాలకు సెకండ్ సింగిల్ ను రిలీజ్ చేయనున్నట్టు  చెబుతూ, అధికారిక పోస్టర్ ను వదిలారు. 'దడ దడ' అంటూ నాయకానాయికల మధ్య ఈ పాట కొనసాగనుంది. 

 రామ్ సరసన నాయిగా కృతి శెట్టి అలరించనుంది. రామ్ మొదటిసారిగా పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ఈ సినిమాలో ఆయన పాత్రను డిజైన్ చేసిన తీరు చాలా కొత్తగా ఉంటుందని అంటున్నారు. తెలుగుతో పాటు తమిళంలోను జులై 14వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

More Telugu News