KCR: క్రీడాకారులను స‌త్క‌రించిన కేసీఆర్‌... నిఖ‌త్‌, ఈషా, మొగుల‌య్య‌ల‌కు చెక్‌ల‌ అంద‌జేత‌

kcr handed over cheques to nikhat zareen and esha singh and kinnera mogulaiah
  • ప్ర‌గ‌తి భ‌వ‌న్‌కు నిఖత్‌, ఈషా, మొగుల‌య్య‌లు
  • ప్ర‌క‌టించిన ప్రోత్సాహ‌కాల‌ను అంద‌జేసిన కేసీఆర్‌
  • కేసీఆర్‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపిన నిఖ‌త్‌
వ‌ర‌ల్డ్ బాక్సింగ్ చాంపియ‌న్‌గా నిలిచిన తెలంగాణ మ‌హిళా బాక్స‌ర్ నిఖ‌త్ జ‌రీన్‌ను సీఎం కేసీఆర్ గురువారం ఘ‌నంగా స‌న్మానించారు. నిఖ‌త్ జ‌రీన్ తో పాటు షూటింగ్‌లో స‌త్తా చాటిన ఈషా సింగ్‌ను కూడా కేసీఆర్ స‌న్మానించారు. గురువారం తెలంగాణ ఆవిర్భావ వేడుక‌ల సంద‌ర్భంగా పబ్లిక్ గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో ఇద్ద‌రు క్రీడాకారుల‌తో పాటు కిన్నెర క‌ళాకారుడు, ప‌ద్మ‌శ్రీ అవార్డు గ్ర‌హీత ద‌ర్శ‌నం మొగుల‌య్య‌ను కూడా కేసీఆర్ స‌న్మానించారు.

ఈ సంద‌ర్భంగా నిఖ‌త్‌, ఈషాల‌కు ప్ర‌క‌టించిన రూ.2 కోట్ల ప్రోత్సాహ‌కం చెక్కుల‌ను కేసీఆర్ వారికి అంద‌జేశారు. అదే స‌మ‌యంలో మొగుల‌య్య‌కు గ‌తంలోనే ప్ర‌క‌టించిన రూ.1 కోటి ప్రోత్సాహ‌కాన్ని కూడా ఆయ‌న‌కు కేసీఆర్ అంద‌జేశారు. ప్రోత్సాహ‌కం అందించ‌డంతో పాటు త‌మ‌కు కేసీఆర్ వెన్నుద‌న్నుగా నిలిచార‌ని నిఖ‌త్ పేర్కొన్నారు. అనంతరం నిఖత్, ఈషాలను ప్రగతి భవన్ తీసుకెళ్లిన కేసీఆర్ వారితో కలిసి భోజనం చేశారు. 
KCR
TRS
Pragathi Bhavan

More Telugu News