Divyavani: చంద్రబాబును ఎవరైనా ఒక్క మాట అన్నా తట్టుకోలేను: టీడీపీకి రాజీనామా తర్వాత దివ్యవాణి స్పందన

Divyavani praises Chandrababu after resigning to TDP
  • చంద్రబాబు మంచి విజన్ ఉన్న నాయకుడు
  • ప్యాకేజీ అందినందుకే రాజీనామా చేశానని కొందరు బుద్ధి లేని వాళ్లు అంటున్నారు
  • ఏడాది కాలంగా టీడీపీలో ప్రాధాన్యతను తగ్గించారు
తెలగుదేశం పార్టీకి సినీ నటి దివ్యవాణి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. కంటతడి పెట్టుకున్నారు. చంద్రబాబు మంచి విజన్ ఉన్న నాయకుడని కొనియాడారు. ఈ మాటను ఇప్పుడే కాదు, ఎప్పుడైనా చెపుతానని అన్నారు. 

తాను ఎప్పుడూ ఎవరి భజన చేయనని చెప్పారు. చంద్రబాబు హైదరాబాద్ నుంచి వచ్చి వెళ్తున్నారని, తాను కూడా హైదరాబాద్ నుంచే వచ్చి వెళ్తున్నానని అన్నారు. టీడీపీ అధినేతను కొందరు రాంగ్ రూట్లోకి తీసుకెళ్తున్నారని చెప్పారు. చంద్రబాబాబును ఎవరైనా ఒక్క మాట అన్నా తాను తట్టుకోలేనని అన్నారు. 

తనకు ప్యాకేజీ అందిందని కొందరు బుద్ధిలేని మాటలు మాట్లాడుతున్నారని దివ్యవాణి మండిపడ్డారు. ప్యాకేజీ తీసుకుని తాను రాజీనామా చేయలేదని చెప్పారు. రాజీనామా చేసేందుకు పూర్తి క్లారిటీ తీసుకోవడానికే ఇప్పటి వరకు ఆగానని తెలిపారు. ఏడాది కాలంగా పార్టీలో తనకు ప్రాధాన్యతను తగ్గించారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో తన స్థానం ఏమిటో కూడా తనకు తెలియని పరిస్థితి ఉందని అన్నారు.

పార్టీ ఆఫీస్ లో కనీసం ప్రెస్ మీట్ లు పెట్టడానికి కూడా అవకాశం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీకి ఎంతో సేవ చేశానని.. కానీ, ఇలాంటి రోజు వస్తుందని తాను ఎప్పుడూ ఊహించలేదని అన్నారు. ప్రజలకు చంద్రబాబు మంచి చేస్తారనే ఏకైక ఉద్దేశంతోనే టీడీపీలో చేరానని చెప్పారు.
Divyavani
Chandrababu
Telugudesam

More Telugu News