Shahrukh Khan: షారుక్ ఖాన్ సినిమాకి టైటిల్ ఖరారు చేసిన అట్లీ కుమార్!

Atlee Kumar movie update
  • వరుస ఫ్లాపులతో ఉన్న షారుక్ 
  • ఆయనను ఒప్పించిన అట్లీ కుమార్ 
  • టైటిల్ గా 'జవాన్' ఖరారు 
  • ఈ సినిమాతోనే నయనతార బాలీవుడ్ ఎంట్రీ  
తమిళనాట మాస్ డైరెక్టర్ గా అట్లీ కుమార్ కి మంచి పేరు ఉంది. విజయ్ హీరోగా ఆయన చేసిన 'తెరి' .. 'మెర్సెల్' .. 'బిగిల్' సినిమాలు అక్కడ భారీ విజయాలను సాధించాయి. అనువాదంగా తెలుగులో వచ్చిన ఈ సినిమాలు ఇక్కడ కూడా మంచి వసూళ్లనే రాబట్టాయి. ఈ నేపథ్యంలోనే తన ఫేవరేట్ హీరో షారుక్ తో సినిమా చేయాలని అట్లీ కుమార్ భావించాడు. 

అయితే ఆ మధ్య వరుస ఫ్లాపులతో షారుక్ సతమతమయ్యాడు. అందువలన ఆయన తన సినిమాల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఈ మధ్యలో ఆయన అంగీకరించినవి రెండే సినిమాలు. ఒకటి 'పఠాన్' అయితే మరొకటి 'డంకి'. 'పఠాన్' చిత్రీకరణ ముగింపు దశలో ఉండగా, 'డంకి' ఇటీవలే మొదలైంది. 

ఈ నేపథ్యంలోనే షారుక్ తో చేయాలనుకున్న కథపై కసరత్తు చేస్తూ వచ్చిన అట్లీ కుమార్, మొత్తానికి ఆయనను ఒప్పించినట్టు సమాచారం. ఈ సినిమాకి 'జవాన్' అనే టైటిల్ ను ఖరారు చేయనున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాలో కథానాయిగా నయనతార పేరు వినిపిస్తోంది. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కుతుందట.
Shahrukh Khan
Atlee Kumar
Bollywood

More Telugu News