India: దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. మహారాష్ట్ర, కేరళ నుంచే అధికం

India reports 3712 fresh corona cases
  • గత 24 గంటల్లో కొత్తగా 3,712 కరోనా కేసుల నమోదు
  • కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 2,584
  • దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 19,509
మన దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. ముందు రోజు 2,745గా ఉన్న కేసుల సంఖ్య మరోసారి మూడు వేలను దాటింది. గత 24 గంటల్లో 3,712 కొత్త కేసులు నమోదయ్యాయి. వీటిలో మహారాష్ట్ర, కేరళ నుంచే రెండు వేలకు పైగా కేసులు వచ్చాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 739 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో దేశ వ్యాప్తంగా 2,584 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఐదుగురు చనిపోయారు. 

ఇక దేశంలో ప్రస్తుతం 19,509 యాక్టివ్ కేసులు ఉన్నాయి. పాజిటివిటీ రేటు 8.4 శాతానికి పెరిగింది. క్రియాశీల రేటు 0.05 శాతంగా, రికవరీ రేటు 98.74 శాతంగా ఉన్నాయి. తాజా కేసులతో కలిపి దేశంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 4.31 కోట్లను దాటింది.

మరోపక్క, 4,26,20,394 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు కరోనా కారణంగా 5,24,641 మంది మృతి చెందారు. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు దాదాపు 1.94 కోట్ల డోసుల కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేశారు. నిన్న ఒక్కరోజే 12,44,298 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. 


India
Corona Virus
Updates

More Telugu News