USA: ఓక్లహామాలోని ఆసుపత్రిలో కాల్పుల మోత.. ముగ్గురు పౌరుల మృత్యువాత

3 Killed In Shooting On Hospital Campus In US Oklahoma
  • అమెరికాలో మరో దుశ్చర్య
  • ఆసుపత్రి క్యాంపస్‌లో దుండగుడి కాల్పులు
  • నిందితుడు కూడా హతం
టెక్సాస్‌లోని ఓ పాఠశాలలో 18 ఏళ్ల యువకుడు జరిపిన కాల్పుల్లో 18 మంది చిన్నారులు సహా 21 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనను మరువకముందే అమెరికాలో మరో దారుణం జరిగింది. ఓక్లహామా రాష్ట్రం తుల్సాలోని సెయింట్ ఫ్రాన్సిస్ ఆసుపత్రి క్యాంపస్ భవనంలోకి ప్రవేశించిన ఓ దుండగుడు యథేచ్ఛగా కాల్పులు జరిపాడు. 

ఈ ఘటనలో ముగ్గురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కాల్పులు జరిపిన దుండగుడు కూడా చనిపోయినట్టు తెలుస్తోంది. అయితే, అతడిని పోలీసులు మట్టుబెట్టారా? లేక, అతడే తనను తాను కాల్చుకుని మృతి చెందాడా? అన్న విషయంలో స్పష్టత లేదు. కాల్పులు జరిపిన వ్యక్తి సహా మొత్తం నాలుగు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.
USA
Oklahoma
Gun Fire
Hospital
Texas

More Telugu News