Gopichand: 'పక్కా కమర్షియల్' నుంచి 'అందాలరాశి' సాంగ్ రిలీజ్!

  • మారుతి తాజా చిత్రంగా 'పక్కా కమర్షియల్'
  • గోపీచంద్ సరసన నాయికగా రాశి ఖన్నా 
  • సంగీత దర్శకుడిగా జేక్స్ బిజోయ్ 
  • జులై 1వ తేదీన ఈ సినిమా విడుదల  
Pakka Commercial song released

గోపీచంద్ - రాశిఖన్నా జంటగా దర్శకుడు మారుతి 'పక్కా కమర్షియల్' సినిమాను రూపొందించాడు. యూవీ క్రియేషన్స్ - గీతా ఆర్ట్స్ కలిసి ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాకి జేక్స్ బిజోయ్ సంగీతాన్ని సమకూర్చాడు. తాజాగా ఈ సినిమా నుంచి ఒక లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. 

'అందాల రాశి' అంటూ సాగే ఈ పాటను ప్రత్యేకంగా వేసిన ఒక సెట్లో చిత్రీకరించారు. కృష్ణకాంత్ సాహిత్యాన్ని అందించిన ఈ పాటను శ్రీ చరణ్ - రమ్య బెహ్రా ఆలపించారు. జానీ మాస్టర్ కొరియోగ్రఫీని అందించాడు. ఈ సినిమాను జులై 1వ తేదీన విడుదల చేయనున్నారు. 

'జిల్' తరువాత గోపీచంద్ - రాశి ఖన్నా కాంబినేషన్లో వస్తున్న రెండో సినిమా ఇది. ఈ మధ్య కాలంలో ఇటు మారుతీకి గానీ .. అటు గోపీచంద్ కి గాని హిట్ లేదు. రాశి ఖన్నా గ్రాఫ్ కూడా అంతంత మాత్రంగానే ఉంది. అందువలన ఈ ముగ్గురూ కూడా ఈ సినిమాపై గట్టిగానే ఆశలు పెట్టుకున్నారు.

More Telugu News