Mallu Bhatti Vikramarka: చింతన్ శిబిర్ కార్యక్రమానికి రేవంత్ రెడ్డి రాకపోవడానికి కారణం ఇదే: మల్లు భట్టివిక్రమార్క

Congress Chintan Sivir started in Hyderabad
  • హైదరాబాద్ లో ప్రారంభమైన చింతన్ శిబిర్ కార్యక్రమం
  • ఉదయ్ పూర్ డిక్లరేషన్ పై చర్చించనున్న కాంగ్రెస్ నేతలు
  • మొత్తం 6 అంశాలపై చర్చించనున్నామన్న మల్లు భట్టి
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చింతన్ శిబిర్ కార్యక్రమం ప్రారంభమైంది. రెండు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో ఉదయ్ పూర్ డిక్లరేషన్ పై చర్చించనున్నారు. ఈ సందర్భంగా మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ, తెలంగాణ రాజకీయ పరిస్థితులను కూడా పొందుపరిచి పార్టీ అధిష్ఠానానికి నివేదిక ఇస్తామని చెప్పారు. మొత్తం 6 అంశాలపై చర్చించనున్నామని, వీటిల్లో రాష్ట్రంలో ఉన్న అన్ని అంశాలు ఉంటాయని తెలిపారు. 

ఉదయ్ పూర్ డిక్లరేషన్ ను జనంలోకి తీసుకెళ్లడం కోసమే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. చింతన్ శిబిర్ లో తీసుకునే నిర్ణయాలు రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి రోడ్ మ్యాప్ లా పని చేస్తాయని తెలిపారు. మరోవైపు ఈ కార్యక్రమానికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హాజరు కాకపోవడంపై స్పందిస్తూ... ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ వల్లే ఆయన హాజరు కాలేదని చెప్పారు. ఇందులో ఎలాంటి వివాదం లేదని అన్నారు.
Mallu Bhatti Vikramarka
Revanth Reddy
Congress
Chintan Sivir

More Telugu News