ఇమ్రాన్ ఖాన్ ‘ఆజాదీ మార్చ్’పై పాక్ రక్షణ మంత్రి తీవ్ర ఆరోపణలు.. ఆయన మద్దతుదారులు ఆటోమెటిక్ రైఫిల్స్‌తో వచ్చారని ఆగ్రహం
- సార్వత్రిక ఎన్నికలు నిర్వహించాలంటూ ‘ఆజాదీ మార్చ్’ నిర్వహించిన ఇమ్రాన్ ఖాన్
- ర్యాలీలో తమ పార్టీ కార్యకర్తలు ఆయుధాలతో పాల్గొన్నారన్న మాజీ ప్రధాని
- తుపాకులే కాకుండా ఆటోమెటిక్ ఆయుధాలతో వచ్చారన్న మంత్రి
- ఇమ్రానే తీసుకురమ్మన్నారని మంత్రి ఆగ్రహం
ఇమ్రాన్ ఇటీవల ఓ టీవీ చానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘ఆజాదీ ర్యాలీ’లో తమ పార్టీ కార్యకర్తలు ఆయుధాలు తీసుకొచ్చారని చెప్పారు. ఇమ్రాన్ చేసిన ఈ వ్యాఖ్యలపై మంత్రి అసిఫ్ మాట్లాడుతూ.. ఆ ఇంటర్వ్యూలో ఇమ్రాన్ చెప్పింది నిజమేనని, ఆయన పార్టీ కార్యకర్తలు తుపాకులే కాకుండా ఆటోమెటిక్ రైఫిల్స్ కూడా ర్యాలీలోకి తీసుకొచ్చారని ఆరోపించారు. ఆయుధాలు తీసుకురావాలని ఇమ్రానే నిరసనకారులకు సూచించారని, ప్రభుత్వానికి ఆ విషయం తెలుసని ఖవాజా పేర్కొన్నారు.