Nani: వైజాగ్ లో 'అంటే .. సుందరానికీ' ట్రైలర్ రిలీజ్ ఈవెంట్!

  • పూర్తి వినోదభరిత చిత్రంగా 'అంటే సుందరానికీ'
  • సుందరం పాత్రలో అల్లరి చేయనున్న నాని 
  • లీలా థామస్ పాత్రలో సందడి చేయనున్న నజ్రియా 
  • జూన్ 10వ తేదీన సినిమా విడుదల
Anate Sundaraniki Movie Update

నాని హీరోగా 'అంటే .. సుందరానికీ' సినిమా రూపొందింది. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమాకి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించాడు. 'బ్రోచేవారెవరురా' సినిమాతో దర్శకుడిగా తన సత్తా చాటుకున్న వివేక్ ఆత్రేయ, పూర్తి వినోదపరమైన అంశాలతో రూపొందించిన సినిమా ఇది. వివేక్ సాగర్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించాడు. 

ఈ సినిమాతో కథానాయికగా నజ్రియా పరిచయమవుతోంది. సుందరం పాత్రలో నాని నటించగా, లీలా థామస్ పాత్రలో నజ్రియా అలరించనుంది. ఈ సినిమా నుంచి ఇంతవరకూ వదిలిన అప్ డేట్స్ జనంలోకి బాగా వెళ్లాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ డేట్ ను ప్రకటిస్తూ, అధికారిక పోస్టర్ ను రిలీజ్ చేశారు. 

ఈ నెల 2వ తేదీన వైజాగ్ - ఆంధ్ర యూనివర్సిటీలోని సీఆర్ కాన్వోకేషన్ హాల్ లో ఈ వేడుకను నిర్వహిస్తున్నారు. ఆ రోజున సాయంత్రం 5 గంటల నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమమవుతుంది. నరేశ్ .. నదియా .. రోహిణి ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమాను, జూన్ 10వ తేదీన విడుదల చేయనున్నారు.

More Telugu News