Telangana: తెలంగాణలో రుతుపవనాలు ఎప్పుడు ప్రవేశిస్తున్నాయంటే...!

  • మూడు రోజుల ముందుగానే కేరళలో ప్రవేశించిన రుతుపవనాలు
  • జూన్ 5న తెలంగాణలోకి ప్రవేశించే అవకాశం
  • తెలంగాణలో ఐదు రోజుల పాటు అక్కడక్కడ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ
Mansoons enters into Telangana on June 5

మండుటెండలతో జనాలను ఠారెత్తించిన వేసవి ముగియబోతోంది. ఇప్పటికే పగటి ఉష్ణోగ్రతలు కొంత మేర తగ్గాయి. మరోవైపు రుతుపవనాలు ఇప్పటికే కేరళలోకి ప్రవేశించాయి. జూన్ 5న తెలంగాణలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రానున్న ఐదు రోజుల పాటు రాష్ట్రంలో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. క్రమంగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయని తెలిపింది.   

జూన్ 5న తెలంగాణలో ప్రవేశించే రుతుపవనాలు జూన్ 5 లేదా 6వ తేదీల్లో పురోగమిస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రుతుపవనాల కదలిక ప్రస్తుతం కన్నూర్, పాలక్కాడ్ పరిసర ప్రాంతాల గుండా కొనసాగుతోందని చెప్పింది. 

మరోవైపు భారత వాతావరణ విభాగం డైరెక్టర్ జనరల్ మృత్యుంజ్ మహాపాత్ర మాట్లాడుతూ, సాధారణ తేదీ కంటే మూడు రోజుల ముందుగానే రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించాయని చెప్పారు. రుతుపవనాల కదలికకు అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని తెలిపారు.

More Telugu News