Mahesh Babu: తన తండ్రి పుట్టినరోజు సందర్భంగా మహేశ్ బాబు భావోద్వేగం!

Mahesh Babu emotional tweet on his father Krishna birthday
  • నేడు సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు
  • మీలాంటి మహోన్నత వ్యక్తి మరొకరు ఉండరన్న మహేశ్ బాబు
  • నిండు నూరేళ్లు ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని ఆకాంక్షించిన మహేశ్
టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్ బాబుకు తన తండ్రి కృష్ణ అంటే ఎంతటి ప్రేమాభిమానాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సందర్భం వచ్చినప్పుడల్లా తన తండ్రి గురించి ఆయన మాట్లాడుతుంటారు. ఈరోజు సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు. ఈ సందర్భంగా కృష్ణకు సినీ ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 

మహేశ్ బాబు కూడా ట్విట్టర్ వేదికగా తన తండ్రికి బర్త్ డే విషెస్ తెలిపారు. 'హ్యాపీ బర్త్ డే నాన్న. మీలాంటి ఉన్నతమైన వ్యక్తి మరొకరు ఉండరు. మీరు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలి. భగవంతుడి ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉండాలి. లవ్ యూ' అంటూ భావోద్వేగంతో ట్వీట్ చేశారు. 
Mahesh Babu
Super Star Krishna
Birthday
Tollywood

More Telugu News