ఏపీ సెక్రటేరియట్ సమీపంలోని అన్న క్యాంటీన్ ను ధ్వంసం చేసిన దుండగులు!

Anna canteen near AP Secretariat destroyed
  • వెలగపూడిలోని అన్న క్యాంటీన్ ధ్వంసం
  • గోడలు పగలగొట్టి, ఇటుకలను తొలగించిన వైనం
  • గతంలో ఈ క్యాంటీన్ ను ప్రారంభించిన చంద్రబాబు
అమరావతిలోని వెలగపూడిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయం సమీపంలో ఉన్న అన్న క్యాంటీన్ ను గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. రాష్ట్ర సచివాలయానికి వెళ్లే మార్గంలో కుడివైపున ఈ క్యాంటీన్ ఉంది. టీడీపీ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ క్యాంటీన్ ను ప్రారంభించారు. 

ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్న క్యాంటీన్లు మూతపడ్డాయి. దీంతో సచివాలయం పక్కనున్న అన్న క్యాంటీన్ ప్రాంతం పిచ్చిమొక్కలతో నిండిపోయింది. ఈ క్రమంలో ఈ క్యాంటీన్ ను ఎవరో ధ్వంసం చేశారు. క్యాంటీన్ పైకప్పు తొలగించి, గోడలు పగులగొట్టారు. ఇటుకలను తొలగించారు. దీనికి సంబంధించిన ఫొటోలను కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
Go Back to Shorts
Anna Canteen
AP Secretariat
Velagapudi
Chandrababu

More Telugu News