CM Jagan: సివిల్స్ తెలుగు ర్యాంకర్లకు సీఎం జగన్ అభినందనలు

CM Jagan congratulates Civils rankers
  • సివిల్స్ ఫలితాలు వెల్లడించిన యూపీఎస్సీ
  • ర్యాంకర్లలో 21 మంది తెలుగువారు
  • యశ్వంత్ రెడ్డికి 15వ ర్యాంకు
  • పూసపాటి సాహిత్యకు 24వ ర్యాంకు
ఆలిండియా సర్వీసుల కోసం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్స్ పరీక్షల ఫలితాలు నేడు వెలువడ్డాయి. ఈసారి మొత్తం 685 మంది సివిల్ సర్వీసులకు అర్హత సాధించినట్టు యూపీఎస్సీ వెల్లడించింది. కాగా, సివిల్స్ లో తెలుగు వాళ్లు 21 మంది సత్తాచాటారు. వారిలో ఆరుగురు టాప్-100లో నిలిచారు. 

దీనిపై ఏపీ సీఎం జగన్ స్పందించారు. సివిల్స్ లో మెరుగైన ర్యాంకులు సాధించిన తెలుగువారికి అభినందనలు తెలిపారు. 15వ ర్యాంక్ సాధించిన యశ్వంత్ రెడ్డిని, పూసపాటి సాహిత్య (24వ ర్యాంకు), కొప్పిశెట్టి కిరణ్మయి (56వ ర్యాంకు), గడ్డం సుధీర్ కుమార్ రెడ్డి (69వ ర్యాంకు) తదితరులను అభినందించారు.
CM Jagan
Rankers
Civils
UPSC
Andhra Pradesh

More Telugu News