Somireddy Chandra Mohan Reddy: రాజమౌళి బాహుబలిని మించిన జగన్ జనబలి: సోమిరెడ్డి విమర్శనాస్త్రాలు

Somireddy take a dig at CM Jagan three years completion
  • సీఎంగా ప్రమాణస్వీకారం చేసి మూడేళ్లు
  • ఉద్వేగభరితంగా స్పందించిన సీఎం జగన్
  • అబ్బో ఎన్ని ఘనతలో అంటూ సోమిరెడ్డి వ్యంగ్యం
  • రీల్ స్టోరీని మించిన రియల్ క్రైమ్ స్టోరీ అంటూ వ్యాఖ్యలు
ఏపీ సీఎంగా ప్రమాణస్వీకారం చేసి మూడేళ్లయిన సందర్భంగా వైఎస్ జగన్ భావోద్వేగాలతో స్పందించడం తెలిసిందే. దీనిపై టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శనాస్త్రాలు సంధించారు. రాజమౌళి బాహుబలిని మించిన జగన్ జనబలి అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. 3 గంటల రీల్ స్టోరీని మించిన మూడేళ్ల రియల్ క్రైమ్ స్టోరీ అంటూ ఎద్దేవా చేశారు.

తప్పుడు కేసులు, కల్తీ మద్యం అమ్మకాలు, ఇసుక స్వాహాలు, విమర్శిస్తే అరెస్టులు, ఉద్యోగుల గొంతుకోత, కరెంటు కొరత, రైతుల కడుపుమంట, నిరుద్యోగుల నోట్లో మట్టి, రోడ్లు చూస్తే మాహిష్మతి సామ్రాజ్యం నాటి గుర్తులు, పోలవరానికి పాతర, ఎమ్మెల్యేలను కాలకేయులుగా మార్చిన ఘనత... అబ్బో మూడేళ్ల పాలనలో చెప్పుకోవడానికి ఎన్ని గొప్పలో... అంటూ ఏకరవుపెట్టారు.
Somireddy Chandra Mohan Reddy
CM Jagan
TDP
YSRCP
Andhra Pradesh

More Telugu News