UPSC: సివిల్ సర్వీసెస్ - 2021 ఫలితాల విడుదల.. ఆలిండియా టాపర్ శ్రుతి శర్మ.. టాప్ ఫోర్ ర్యాంకులు అమ్మాయిలకే!

  • రెండో ర్యాంక్ సాధించిన అంకిత అగర్వాల్
  • మూడో ర్యాంకును పొందిన గామిని సింగ్లా 
  • 685 మంది అభ్యర్థులను సెలెక్ట్ చేసిన యూపీఎస్సీ
UPSC Civil Services Result 2021 declared Shruti Sharma tops the exam

2021 సివిల్ సర్వీసెస్ పరీక్షల ఫైనల్ రిజల్ట్స్ ను యూపీఎస్సీ కాసేపటి క్రితం విడుదల చేసింది. ఈ ఏడాది ఆలిండియా టాప్ ర్యాంకర్ గా శ్రుతి శర్మ నిలిచారు. రెండో ర్యాంకును అంకిత అగర్వాల్, మూడో ర్యాంకును గామిని సింగ్లా సాధించారు. టాప్ ఫోర్ ర్యాంకులను అమ్మాయిలే సాధించడం విశేషం.

ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ రౌండ్స్ తర్వాత యూపీఎస్సీ తుది ఫలితాలను విడుదల చేసింది. మెయిన్స్ ఫలితాలను మార్చి 17న యూపీఎస్సీ ప్రకటించింది. ఆ తర్వాత ఏప్రిల్ 5 నుంచి మే 26 వరకు ఇంటర్వ్యూలు (పర్సనాలిటీ టెస్ట్) నిర్వహించింది. మెయిన్స్, ఇంటర్వ్యూ మార్కులతో సివిల్స్ విజేతలను ఈరోజు ప్రకటించింది. 

మొత్తం 685 మందిని సివిల్ సర్వీసెస్ అపాయింట్ మెంట్ కోసం యూపీఎస్సీ సిఫారసు చేసింది. వీరిలో 244 మంది జనరల్, 73 మంది ఈడబ్ల్యూఎస్, 203 మంది ఓబీసీ, 105 మంది ఎస్సీ, 60 మంది ఎస్టీ కేటగిరీ అభ్యర్థులు ఉన్నారు. 

సివిల్స్ టాప్ 10 ర్యాంకర్లు వీరే:

  • శ్రుతి శర్మ
  • అంకిత అగర్వాల్
  • గామిని సింగ్లా
  • ఐశ్వర్య వర్మ
  • ఉత్కర్ష్ ద్వివేది
  • యక్ష్ చౌదరి
  • సమ్యక్ ఎస్ జైన్
  • ఇషిత రాథీ
  • ప్రీతమ్ కుమార్
  • హర్ కీరత్ సింగ్ రంధావా

More Telugu News