Nara Lokesh: జగన్ మూడేళ్ల పాలన గురించి మూడు మాటల్లో చెప్పిన నారా లోకేశ్!

Nara Lokesh explains Jagans 3 years rule in 3 words
  • వైసీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తి
  • జగన్ మూడేళ్ల పాలన విద్వేషం, విధ్వంసం, విషాదం అన్న నారా లోకేశ్
  • రాబోయే రెండేళ్లలో రాష్ట్రం సర్వనాశనం కావడం ఖాయమని వ్యాఖ్య
ఏపీలో వైసీపీ అధికారాన్ని చేపట్టి నేటికి మూడేళ్లయింది. ఈ సందర్భంగా వైసీపీ నేతలు, కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్నారు. మరోవైపు, జగన్ మూడేళ్ల పాలనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు. 

జగన్ రెడ్డి గారి మూడేళ్ల పాలన మూడు మాటల్లో చెప్పాలంటే... విద్వేషం, విధ్వంసం, విషాదం అని ఆయన అన్నారు. ఈ మూడేళ్లలో సాధించింది శూన్యమని చెప్పారు. రాబోయే రెండేళ్లలో రాష్ట్రం సర్వనాశనం కావడం ఖాయమని అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. విద్వేషానికి సంబంధించి రామతీర్థంలో రాముని తల నరికవేతను, విధ్వంసానికి సంబంధించి ప్రజావేదిక కూల్చివేతను, విషాదానికి సంబంధించి ఎల్జీ పాలిమర్స్ విషాద ఘటనను ఆయన ఉదాహరించారు. 


Nara Lokesh
Telugudesam
Jagan
YSRCP

More Telugu News