Jagan: మీరు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నా.. మీకు మరింతగా సేవ చేస్తా: జగన్

CM Jagan thanks AP people for their love and affection
  • మీ ప్రేమ, ఆశీస్సులతో సీఎంగా బాధ్యతలు చేపట్టి మూడేళ్లవుతోందన్న జగన్ 
  • మూడేళ్లలో 95 శాతానికి పైగా హామీలను అమలు చేశామని వెల్లడి 
  • మీ ప్రేమాభిమానాలు నాపై ఎప్పటికీ ఇలాగే ఉండాలంటూ ట్వీట్ 
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్యమంత్రి జగన్ కృతజ్ఞతలు తెలియజేశారు. రాబోయే రోజుల్లో మీకు మరింతగా సేవ చేస్తానని ట్విట్టర్ ద్వారా తెలిపారు. 'మీరు చూపిన ప్రేమ‌, మీరు అందించిన ఆశీస్సుల‌తో ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టి మూడేళ్లు అవుతోంది. మీరు నాపై పెట్టుకున్న‌ న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టుకుంటూ గ‌డిచిన మూడేళ్ల‌లో 95 శాతానికి పైగా హామీల‌ను అమ‌లు చేశాం. ఎన్నో మంచి ప‌నుల‌కు శ్రీ‌కారం చుట్టాం. రాబోయే రోజుల్లో మీకు మరింతగా సేవ చేస్తానని, మీ ప్రేమాభిమానాలు నాపై ఎప్పటికీ ఇలాగే ఉండాలని మ‌న‌స్పూర్తిగా కోరుకుంటున్నా. మీకు సేవ చేసే భాగ్యాన్ని నాకు కల్పించినందుకు మ‌రొక్క‌సారి అందరికీ కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేసుకుంటున్నా' అని ట్వీట్ చేశారు.
Jagan
YSRCP

More Telugu News