Prabhas: సముద్రంలో 'సలార్' క్లైమాక్స్!

Salaar movie update
  • 'కేజీఎఫ్ 2'తో హిట్ కొట్టిన ప్రశాంత్ నీల్  
  • ఆ తరువాత సినిమాగా రూపొందుతున్న 'సలార్'
  • ప్రభాస్ జోడీగా నటిస్తున్న శ్రుతి హాసన్
  • కోట్ల రూపాయల ఖర్చుతో క్లైమాక్స్ చిత్రీకరణ    
ప్రభాస్ కథానాయకుడిగా 'సలార్' సినిమా రూపొందుతోంది. విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న ఈ సినిమాకి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రశాంత్ నీల్ నుంచి ఇటీవల వచ్చిన 'కేజీఎఫ్ 2' సినిమా సంచలన విజయాన్ని సాధించడంతో, సహజంగానే 'సలార్' పై భారీ అంచనాలు ఉన్నాయి.

'కేజీఎఫ్ 2' సినిమాలో క్లైమాక్స్ కి కథ సముద్రం పైకి చేరుకుంటుంది. అలాగే 'సలార్' సినిమా క్లైమాక్స్ కూడా సముద్రంపైకి చేరుకుంటుందని అంటున్నారు. సముద్రం లోపల ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరిస్తారట. ఈ యాక్షన్ ఎపిసోడ్ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. ఇందుకోసం భారీ మొత్తంలో ఖర్చు చేస్తున్నారట. 

ప్రభాస్ సరసన నాయికగా శ్రుతి హాసన్ అలరించనుంది. ముఖ్యమైన పాత్రలలో జగపతిబాబు ..   పృథ్వీరాజ్ సుకుమారన్ .. ఈశ్వరీరావు కనిపించనున్నారు. జగపతిబాబు పాత్ర చాలా డిఫరెంట్ గా ఉంటుందని అంటున్నారు. రవి బస్రూర్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చాడు. వచ్చే ఏడాదిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Prabhas
Sruthi Haasan
Salaar Movie

More Telugu News