Chipsets: రష్యా ఆయుధాలు విప్పదీసి చూసి దిగ్భ్రాంతికి గురైన ఉక్రెయిన్ ఇంజినీర్లు!

Ukraine knows Russian weapons have foreign chip sets inside
  • ఉక్రెయిన్ పై కొనసాగుతున్న రష్యా దాడులు
  • రష్యా ఆయుధాలను స్వాధీనం చేసుకున్న ఉక్రెయిన్
  • రష్యా ఆయుధాల్లో అమెరికా, పాశ్చాత్య దేశాల చిప్ లు
ఉక్రెయిన్ పై దాడుల సందర్భంగా రష్యా కూడా గణనీయంగానే నష్టపోయింది. అనేకమంది రష్యా సైనికులు హతులయ్యారు. పెద్ద ఎత్తున రష్యా ఆయుధాలు ఉక్రెయిన్ సేనల పరమయ్యాయి. వాటిలో పింట్సర్ గగనతల రక్షణ వ్యవస్థ, కేహెచ్-101 క్రూయిజ్ మిస్సైల్, కేఏ-52 హెలికాప్టర్, బర్నల్ టి గగనతల రక్షణ వ్యవస్థ,  కూడా ఉన్నాయి. ఇవేకాకుండా ఇంకా అనేక ఆయుధాలు కూడా ఉక్రెయిన్ దళాల చేతచిక్కాయి. 

అయితే, ఈ ఆయుధాలను, ఆయుధ వ్యవస్థలను విప్పదీసి చూసిన ఉక్రెయిన్ ఇంజినీర్లు విస్మయం చెందారు. రష్యా ఆయుధాల్లో వినియోగించిన కీలకమైన ఎలక్ట్రానిక్ చిప్ లన్నీ అమెరికా, ఇతర పాశ్చాత్య దేశాల్లో తయారైనవే. వీటిలో కొన్ని చిప్ లను డిష్ వాషర్లు, రిఫ్రిజిరేటర్ల నుంచి కూడా సేకరించారంటే రష్యన్ల తెలివితేటలు ఎలాంటివో అర్థమవుతోంది. 

వీటిలో కొన్ని చైనా నుంచి సమీకరించినవి కాగా, కొన్నింటిని బ్లాక్ మార్కెట్లోనూ, కొన్నింటిని రీసైక్లింగ్ చేయడం ద్వారానూ రష్యా సమకూర్చుకున్నట్టు భావిస్తున్నారు. ఉక్రెయిన్ పై దాడి ప్రకటించగానే, రష్యాపై పాశ్చాత్యదేశాలు ఆంక్షలు విధించాయి. అయినప్పటికీ రష్యా ఆయుధాల్లో విదేశీ చిప్ సెట్లు దర్శనవమివ్వడం అమెరికా తదితర దేశాలకు మింగుడుపడడం లేదు.
Chipsets
Weapons
Russia
Ukraine

More Telugu News