Pub: హైద‌రాబాద్‌లో మ‌ళ్లీ క్యాబ‌రే డ్యాన్సులు... ట‌కీలా ప‌బ్ సీజ్‌

hyderabad taskforce police seize takila pub in secunderabad
  • రాంగోపాల్‌పేట్ ప‌రిధిలోని ట‌కీలా ప‌బ్‌లో క్యాబ‌రే డ్యాన్సులు
  • అర్థ‌రాత్రి దాటినా మూత‌ప‌డ‌ని బార్‌
  • ప‌క్కా స‌మాచారంతో ప‌బ్‌పై టాస్క్‌ఫోర్స్ దాడులు
  • ప‌బ్ సీజ్‌... 18 మంది అరెస్ట్‌
చాలా ఏళ్ల క్రితం హైద‌రాబాద్ ప‌బ్‌ల నుంచి మాయ‌మైన క్యాబ‌రే డ్యాన్సులు మ‌ళ్లీ మొద‌ల‌య్యాయి. శ‌నివారం రాత్రి సికింద్రాబాద్ ప‌రిధిలోని రాంగోపాల్‌పేట్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో ఉన్న ట‌కీలా ప‌బ్‌లో క్యాబ‌రే డ్యాన్సులు క‌నిపించాయి. మ‌ద్యం మ‌త్తులో తూగుతున్న మందుబాబులను మ‌రింత‌గా హుషారెత్తించేందుకు ప‌బ్ యాజ‌మాన్యం యువ‌తుల‌తో నృత్యాల‌ను ఏర్పాటు చేసింది. అంతేకాకుండా అర్ధ రాత్రి దాటినా కూడా ప‌బ్‌ను కొన‌సాగిస్తూ నిబంధ‌న‌ల‌ను అతిక్ర‌మించింది.

ఈ ప‌బ్ వ్య‌వ‌హారంపై స‌మాచారం అందుకున్న హైద‌రాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ట‌కీలా ప‌బ్‌పై శ‌నివారం రాత్రి పొద్దుపోయిన త‌ర్వాత దాడులు చేశారు. నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా ప‌బ్‌ను నిర్వ‌హిస్తున్నార‌ని తేల్చిన పోలీసులు ప‌బ్‌ను సీజ్ చేశారు. ప‌బ్‌లో క్యాబ‌రే డ్యాన్స్ ఏర్పాటు చేసిన వైనాన్ని గుర్తించిన పోలీసులు మొత్తం 18 మందిని అరెస్ట్ చేశారు.
Pub
Hyderabad
Secunderabad
Taskforce Police
Hyderabad Police

More Telugu News