theenmar Mallanna: తీన్మార్ మల్లన్న అరెస్ట్.. ఉద్రిక్తత!

Theenmar Mallanna Arrest
  • హనుమకొండ జిల్లా అరెపల్లిలో తీన్మార్ మల్లన్న అరెస్ట్
  • భూసేకరణకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతుగా వెళ్లిన మల్లన్న
  • తోపులాటల మధ్యే మల్లన్నను అదుపులోకి తీసుకున్న పోలీసులు
హనుమకొండ జిల్లా అరెపల్లిలో తీన్మార్ మల్లన్నను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వివరాల్లోకి వెళ్తే... భూసేకరణ జీవో 80ఏ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అరెపల్లిలో రైతులు ఆందోళన బాట పట్టారు. 

ఈ నేపథ్యంలో వారికి మద్దతు తెలిపేందుకు తీన్మార్ మల్లన్న అక్కడకు వచ్చారు. దీంతో ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. తోపులాటల మధ్యే మల్లన్నను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

శాంతియుతంగా కొనసాగుతున్న నిరసన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంత మందిని అరెస్ట్ చేసినా తమ ఆందోళనలు ఆగవని అన్నారు. మల్లన్న అరెస్ట్ తో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అంతకు ముందు తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ, బాధిత రైతులకు అండగా ఉంటామని చెప్పారు. 80ఏ జీవోను రద్దు చేసేంత వరకు రైతులంతా ఐకమత్యంతో పోరాడాలని సూచించారు.
theenmar Mallanna
Arrest

More Telugu News