Obed McCoy: అమ్మకు అనారోగ్యం.. అయినా రాజస్థాన్ గెలుపుకోసం మెక్ కాయ్ కృషి 

His mother has been ill He had to deal with that yet was exceptional Sangakkara
  • వెస్టిండీస్ లో అనారోగ్యంతో బాధపడుతున్న మెక్ కాయ్ తల్లి
  • అంత కష్టంలోనూ గొప్పగా బౌలింగ్ చేశాడన్న సంగక్కర
  • అతడి అంతకితభావం ఎంతో గొప్పదంటూ ప్రశంస
ఆర్సీబీని ఓడించి రాజస్థాన్ రాయల్స్ ఫైనల్ బెర్తు ఖాయం చేసుకోవడంలో ఇద్దరు బౌలర్ల పాత్రను ఆ జట్టు హెడ్ కోచ్ గా సేవలు అందిస్తున్న కుమార సంగక్కర ప్రస్తావించాడు. వెస్టిండీస్ బౌలర్ ఒబెద్ మెక్ కాయ్ అంకిత భావాన్ని సంగక్కర ప్రధానంగా ప్రస్తావించాడు. శుక్రవారం నాటి మ్యాచ్ లో కేవలం 23 పరుగులు ఇచ్చిన మెక్ కాయ్ మూడు వికెట్లు తీశాడు. 

మెక్ కాయ్ తల్లి వెస్టిండీస్ లో అనారోగ్యంతో బాధపడుతున్నట్టు సంగక్కర చెప్పాడు. అంత కష్టంలోనూ గొప్పగా బౌలింగ్ చేసి కీలకంగా వ్యవహరించాడని ప్రశంసించాడు. మెక్ కాయ్ అంకిత భావం ఎంతో గొప్పదిగా అభివర్ణించాడు. మెక్ కాయ్ తోపాటు, ప్రసిద్ధ కృష్ణ మూడు వికెట్లు తీసి ఆర్సీబీని 157 పరుగులకే కట్టడి చేయడంలో కీలకంగా పనిచేశాడు. బ్యాటింగ్ వైపు జోస్ బట్లర్ వీర విహారం చేసి రాజస్థాన్ గెలుపును ఖాయం చేశాడు.
Obed McCoy
Sangakkara
hails
mother ill
west indies

More Telugu News