Chandrababu: కేంద్ర మంత్రి నితిన్ గడ్క‌రీకి చంద్ర‌బాబు బ‌ర్త్ డే విషెస్‌!

chandrababu wishes to nitin gadkari on his birth day
  • నేడు నితిన్ గ‌డ్క‌రీ బ‌ర్త్ డే
  • ట్విట్ట‌ర్ వేదిక‌గా కేంద్ర మంత్రికి చంద్ర‌బాబు విషెస్‌
  • గ‌డ్క‌రీతో తాను క‌లిసి ఉన్న ఫొటోను యాడ్ చేసిన టీడీపీ చీఫ్‌
టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు శుక్ర‌వారం పార్టీ పండుగ మ‌హానాడు వేడుక‌ల్లో ఫుల్ బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇంత‌టి బిజీ షెడ్యూల్‌లోనూ ఆయ‌న బీజేపీ సీనియ‌ర్ నేత‌, కేంద్ర ర‌వాణా శాఖ మంత్రి నితిన్ గడ్క‌రీకి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపారు. 

ఈ మేర‌కు గ‌డ్క‌రీ జ‌న్మ‌దినాన్ని గుర్తు చేసుకున్న చంద్ర‌బాబు ట్విట్ట‌ర్ వేదిక‌గా ఆయ‌న‌కు బ‌ర్త్ డే విషెస్ తెలిపారు. గ‌తంలో తాను సీఎంగా ఉండ‌గా...ఏపీ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన గ‌డ్క‌రీతో ఓ వేదిక మీద క‌లిసి కూర్చున్న ఫొటోను చంద్ర‌బాబు త‌న ట్వీట్‌కు జ‌త చేశారు. ప్ర‌జ‌ల‌కు మ‌రింత సేవ చేసేందుకు గ‌డ్క‌రీకి మ‌రింత మేర అవ‌కాశం ఇవ్వాల‌ని ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు ఆకాంక్షించారు.
Chandrababu
TDP Mahanadu
TDP
BJP
Nitin Gadkari

More Telugu News