Manjusha Niyogi: మోడల్ బిదీషా మరణాన్ని జీర్ణించుకోలేక... కోల్ కతాలో మరో మోడల్ బలవన్మరణం

Model Manjusha Niyogi commits suicide after her friend Bidisha death
  • కొన్ని రోజుల వ్యవధిలో ముగ్గురి మరణం
  • బెంగాలీ వినోదరంగంలో విషాదం
  • ఇటీవల పల్లవి డే మృతి
  • కొన్నిరోజుల కిందట బిదీషా మజుందార్ ఆత్మహత్య
  • తాజాగా బిదీషా స్నేహితురాలు మంజూషా సూసైడ్
బెంగాలీ వినోద రంగంలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల నటి పల్లవి డే మరణంతో విషాదంలో మునిగిపోయిన బెంగాలీ చిత్రపరిశ్రమ, కొన్నిరోజుల వ్యవధిలోనే మోడల్, నటి బిదీషా మజుందార్ ఆత్మహత్యతో దిగ్భ్రాంతికి గురైంది. ఇప్పుడు, బిదీషా స్నేహితురాలు, మోడల్ మంజూషా నియోగి బలవన్మరణానికి పాల్పడడం నిశ్చేష్టకు గురిచేసింది. కొన్నిరోజుల వ్యవధిలోనే మూడు మరణాలు సంచలనం సృష్టిస్తున్నాయి. 

కాగా, బిదీషా మృతిని జీర్ణించుకోలేక, తీవ్ర మనస్తాపం చెందిన మంజూషా తన అపార్ట్ మెంట్ లో సీలింగ్ కు ఉరేసుకుని మరణించింది. బిదీషా చనిపోయినప్పటి నుంచి తమ కుమార్తె మానసికంగా కుంగుబాటుకు గురైందని, అంతేకాకుండా, అదేపనిగా బిదీషా గురించే మాట్లాడేదని మంజూషా తల్లి మీడియాకు వివరించారు. కాగా, దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ఆరంభించారు.
Manjusha Niyogi
Suicide
Bidisha Majumdar
Pallavi Dey
Kolkata
Bengal

More Telugu News