బుకర్ ప్రైజ్ తో చరిత్ర సృష్టించిన గీతాంజలి శ్రీ
- టూంబ్ ఆఫ్ శాండ్ ను ఎంపిక చేసిన బుకర్ ప్రైజ్ కమిటీ
- భారతీయ భాషల నుంచి అవార్డు గెలుచుకున్న తొలి పుస్తకం
- అమెరికా ట్రాన్స్ లేటర్ డైసీ రాక్ వెల్ తో సంయుక్తంగా అవార్డుకు ఎంపిక
టూంబ్ ఆఫ్ శాండ్ పుస్తకాన్ని ‘బలమైన వాదాన్ని వినిపించే ఎదురేలేని నవల’గా అవార్డు న్యాయ నిర్ణేతలు అభివర్ణించారు. అవార్డుతో పాటు 50,000 పౌండ్లను విజేతలకు అందిస్తారు. ఉత్తరప్రదేశ్ మెయిన్ పురిలో జన్మించి, ఢిల్లీలో పెరిగిన గీతాంజలిశ్రీ (64) మూడు నవలలు, పలు కథలను ఇప్పటి వరకు రాశారు. బ్రిటన్ లో పబ్లిష్ అవుతున్న ఆమె తొలి పుస్తకం టూంబ్ ఆఫ్ శాండ్. 2000లో మాయ్ అనే పుస్తకం రాయగా, ఇది క్రాస్ వర్డ్ బుక్ అవార్డుకు ఎంపికైంది. గతంలో పలు అవార్డులు సైతం ఆమెను వరించాయి.
టూంబ్ ఆఫ్ శాండ్ 2018లో హిందీలో ప్రచురితమైంది. అంటే బుకర్ ప్రైజ్ కు ఎంపికైన తొలి హిందీ పుస్తకం ఇదే కానుంది. ఈ పుస్తకానికి హిందీలో ‘రేత్ సమాధి’ పేరు. భారతదేశ విభజన నీడలో సాగే ఓ కుటుంబం కథను నవల ఇతి వృత్తంగా రచయిత తీసుకున్నారు.