Rakhi Sawant: బోయ్ ఫ్రెండ్ నుంచి భారీ కానుకలు అందుకున్న రాఖీ సావంత్

Rakhi Sawant says boyfriend Adil Khan bought a house in her name in Dubai gifted her BMW
  • రాఖీ పేరిట దుబాయిలో ఇల్లు కొన్న ఆదిల్ ఖాన్
  • బీఎండబ్ల్యూ కారు కూడా బహూకరించిన ప్రియుడు 
  • శరీరాన్ని మరింతగా కప్పివుంచే వస్త్రాలు ధరించమన్న ఆదిల్ 
  •  అడడి ప్రేమ నిజమైనదంటూ రాఖీ ప్రశంస  
తన బోయ్ ఫ్రెండ్ ఆదిల్ ఖాన్ దుర్రాని తనకు విలువైన కానుకలు అందించి, తన ప్రేమ తెలియజేసినట్టు బాలీవుడ్ నటి రాఖీ సావంత్ వెల్లడించింది. తమ రిలేషన్ షిప్ విషయంలో అతడు ఎంతో సీరియస్ గా ఉన్నట్టు ఆమె చెప్పింది. రాఖీ సావంత్ ఇటీవలే ఆదిల్ కుటుంబ సభ్యులను కలిసేందుకు దుబాయ్ వెళ్లింది. 

అయితే, ఆదిల్ కుటుంబం తమ అనుబంధం పట్ల సానుకూలంగా లేనట్టు ఆమె సంచలన విషయాన్ని బయటపెట్టింది. ఆదిల్ సైతం తనను శరీరాన్ని కప్పివుంచే, తక్కువ ఆకర్షణీయత కలిగిన వస్త్రాలు ధరించాలని కోరుతున్నట్టు రాఖీ సావంత్ వెల్లడించింది. రాఖీ బిగ్ బాస్ 15 లో కనిపించిన తర్వాత నుంచి ఆమె తరచూ వార్తల్లో ఉంటున్న విషయం తెలిసిందే. గతంలో రితేష్ అనే వ్యక్తిని ఆమె వివాహం చేసుకుని, అనంతరం విడిపోయింది. 

ఇప్పుడు ఆదిల్ దుబాయిలో తన పేరిట ఇల్లు కొనుగోలు చేసినట్టు రాఖీ సావంత్ తాజాగా వెల్లడించింది. తర్వాతి రోజు బీఎండబ్ల్యూ కారును బహుమతిగా ఇచ్చినట్టు ప్రకటించింది. ‘‘నిజం చెప్పాలంటే నేనంటే అతనికి ప్రేమ. అడడి ప్రేమ నిజమైనది. నా పట్ల అతడు ఎంతో సీరియస్ గా ఉన్నాడు. లేదంటే ఏ వ్యక్తి ముందుగా ప్రేమ గురించి తల్లిదండ్రులకు చెబుతాడు? అని రాఖీ సావంత్ పేర్కొంది. 

బెంగళూరుకు చెందిన ఆదిల్ రాఖీ సావంత్ కంటే ఆరేళ్లు చిన్న. ఇంతకీ వీరు పెళ్లి చేసుకుంటున్నారా..? అన్న విషయాన్ని రాఖీ సావంత్ స్పష్టం చేయలేదు. తమ రిలేషన్ షిప్ ను ఆదిల్ తల్లిదండ్రులు అర్థం చేసుకునేలా ఆదిల్ ఆంటీ కృషి చేస్తారని ప్రకటించింది.
Rakhi Sawant
boyfriend
Adil Khan
house
Dubai
gift

More Telugu News