రెండు మూడు నెలల్లో సంచలన వార్తను చెపుతాను: కేసీఆర్
- దేశంలో కీలక పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయన్న కేసీఆర్
- కచ్చితమైన మార్పు ఉండబోతోందని వ్యాఖ్య
- ఎందరో ప్రధానులు వచ్చారు.. దేశ పరిస్థితులు మాత్రం మారలేదన్న సీఎం
మన దేశంలో ఇప్పటి వరకు ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయని, ఎందరో ప్రధానులు వచ్చారని... కానీ దేశ పరిస్థితులు మాత్రం బాగుపడలేదని కేసీఆర్ అన్నారు. మన కంటే వెనుకబడి ఉన్న చైనా 16 ట్రిలియన్ ఎకానమీగా ఎదిగిందని... మనం మాత్రం 5 ట్రిలియన్ డాలర్ల వద్దే ఉన్నామని చెప్పారు. దేశంలో మంచి నాయకులు, మంచి వాతావరణ పరిస్థితులు ఉన్నాయని... అయినప్పటికీ మనం ఇప్పటికీ తాగునీరు, సాగునీరు, కరెంట్ సమస్యలతో బాధపడుతున్నామని అన్నారు. మన దేశంలో ద్రవ్యోల్బణం రోజురోజుకు పెరుగుతోందని, జీడీపీ పడిపోయిందని చెప్పారు. కంపెనీలు మూత పడుతున్నాయని, రూపాయి విలువ దారుణంగా పడిపోయిందని అన్నారు.