VV Lakshminarayana: టీడీపీలో చేరబోతున్నారనే వార్తలపై మాజీ జేడీ లక్ష్మీనారాయణ స్పందన!

The news of me joining TDP is not true says VV Lakshminarayana
  • లక్ష్మీనారాయణ టీడీపీలో చేరబోతున్నారంటూ ప్రచారం
  • చంద్రబాబు నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చిందంటూ వార్తలు
  • ఈ వార్తల్లో నిజం లేదన్న లక్ష్మీనారాయణ
సీబీఐ మాజీ అధికారి వీవీ లక్ష్మీనారాయణ (జేడీ) టీడీపీ వైపు చూస్తున్నారంటూ వార్తలు ప్రచారమవుతున్నాయి. ఆయన టీడీపీలో చేరబోతున్నారని ప్రచారం చేస్తున్నారు. ఈ వార్తలను లక్ష్మీనారాయణ ఖండించారు. సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ టీడీపీ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారని... జనసేనకు దూరంగా ఉంటున్న జేడీ టీడీపీలోకి జంప్ కానున్నారని... చంద్రబాబు నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ రావడంతో టీడీపీలో చేరిక లాంఛనమే అని ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. ఈ వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదని చెప్పారు. ఇలాంటి వార్తల కోసం మనం విలువైన సమయాన్ని వృథా చేసుకోవద్దని అన్నారు.
VV Lakshminarayana
CBI
Telugudesam
Janasena

More Telugu News