Balakrishna: 175 రోజులను పూర్తిచేసుకున్న 'అఖండ'

Akhanda completes its glorious silver jubilee run of 175 days
  • బాలయ్య .. బోయపాటి కాంబినేషన్లో వచ్చిన 'అఖండ'
  • క్రితం ఏడాది డిసెంబర్ 2వ తేదీన విడుదలైన సినిమా
  • తాజాగా 175 రోజులు పూర్తిచేసుకుందంటూ పోస్టర్ రిలీజ్
  • సింహా .. లెజెండ్ జాబితాలో చేరిన 'అఖండ'  
బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి దర్శకత్వంలో రూపొందిన 'అఖండ' క్రితం ఏడాది డిసెంబర్ 2వ తేదీన విడుదలైంది. భారీ బడ్జెట్ తో మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా, తాజాగా 175 రోజులను పూర్తిచేసుకుంది. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ అందుకు సంబంధించిన పోస్టర్ ను వదిలారు. 

ఇంతకుముందు బాలకృష్ణ - బోయపాటి కాంబినేషన్లో వచ్చిన 'సింహా' .. 'లెజెండ్' మాదిరిగానే 'అఖండ' కూడా సిల్వర్ జూబిలీ మార్క్ ను టచ్ చేసింది. 'సింహా' .. 'లెజెండ్' ఈ రెండు సినిమాలు కూడా ఎమోషన్ తో కూడుకున్న మాస్ యాక్షన్ సినిమాలే. బాలయ్య బాడీ లాంగ్వేజ్ కి తగిన పవర్ఫుల్ కథలే. 

అయితే 'అఖండ' సినిమా విషయానికి వచ్చేసరికి, మాస్ యాక్షన్ కి దైవశక్తిని తోడు చేయడం జరిగింది. ఎమోషన్ ను దైవశక్తి మీదుగా యాక్షన్ వైపు మళ్లించడంతో అన్నివర్గాల ప్రేక్షకులు కనెక్ట్ అయ్యారు. దాంతో విడుదలైన ప్రతి ప్రాంతంలో కాసుల వర్షం కురిసేసింది. మొత్తానికి బాలయ్య కెరియర్ లోనే ఇది చెప్పుకోదగిన సినిమాగా నిలిచింది.
Balakrishna
Pragya jaiswal

More Telugu News