మరో 20 ఏళ్లలో కేటీఆరే భారత ప్రధాని: మహిళా వ్యాపారవేత్త ఆశా జడేజా మోత్వాని
- దావోస్‌లో కేటీఆర్‌ను కలిసిన ఆశా మోత్వాని
- కేటీఆర్ లాంటి రాజకీయ నాయకుడిని తానింత వరకు చూడలేదంటూ ప్రశంసలు
- పెట్టుబడుల ఆకర్షణకు కేటీఆర్ బృందం దావోస్‌లో అద్భుత కృషి చేస్తోందన్న మోత్వాని
దావోస్‌లో ఏర్పాటు చేసిన తెలంగాణ పెవిలియన్‌లో కేటీఆర్‌ను కలిసిన మోత్వాని ఆయనతో కలిసి దిగిన ఫొటోను ట్విట్టర్‌లో షేర్ చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించేందుకు కేటీఆర్ బృందం దావోస్‌లో అద్భుత కృషి చేస్తోందన్నారు. తమ రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను, అనుకూలతలను వారు వివరిస్తూ దావోస్‌లో దూసుకెళ్తున్నారని కొనియాడారు.