Pinipe Viswarup: నా ఇంటిని తగలబెట్టడం దురదృష్టకరం: మంత్రి పినిపే విశ్వరూప్

Minister Pinipe Viswaroop responds to rioters set fire his house in Amalapuram
  • కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు
  • అమలాపురంలో ఆందోళనలు
  • తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయిన నిరసనకారులు
  • మంత్రి పినిపే విశ్వరూప్ ఇంటికి నిప్పు
  • విచారం వ్యక్తం చేసిన విశ్వరూప్
అమలాపురంలో ఆందోళనకారులు తన నివాసానికి నిప్పంటించడంపై ఏపీ మంత్రి పినిపే విశ్వరూప్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తన నివాసాన్ని తగలబెట్టడం దురదృష్టకరమని పేర్కొన్నారు. జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టడం పట్ల అందరూ గర్వించాలని, ఒకవేళ పేరు మార్పుపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని సూచించారు. అభ్యంతరాలను ప్రభుత్వం పరిశీలిస్తుందని మంత్రి స్పష్టం చేశారు. 

జిల్లాకు పేరు మార్పు నేపథ్యంలో కొన్ని రాజకీయ దుష్ట శక్తులు యువతను రెచ్చగొడుతున్నాయని విశ్వరూప్ ఆరోపించారు. చేతులు జోడించి వేడుకుంటున్నానని, దయచేసి అందరూ సంయమనం పాటించాలని మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు.
Pinipe Viswarup
House
Fire
Protests
Konaseema Districts

More Telugu News