సీన్ రివర్స్ అవడంతో నేడు అంబటి, రోజా రంగంలోకి దిగారు: వంగలపూడి అనిత
- మాజీ డ్రైవర్ ను చంపిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు
- మంత్రుల స్పందనపై అనిత విమర్శలు
- ఎమ్మెల్సీని బర్తరఫ్ చేయాలని విజ్ఞప్తి
ఈ నేపథ్యంలో, టీడీపీ తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత స్పందించారు. నిన్నటివరకు బొత్స వంటి మంత్రులు హంతకుడైన ఎమ్మెల్సీని వెనకేసుకొచ్చారని వెల్లడించారు. సీన్ రివర్స్ అవడంతో నేడు అంబటి, రోజా రంగంలోకి దిగారని విమర్శించారు. జగన్ రెడ్డి నిజంగా న్యాయం వైపే ఉంటే హంతకుడ్ని బర్తరఫ్ చేయించరెందుకు? అని ప్రశ్నించారు. దళితబిడ్డను పాశవికంగా హింసించి చంపిన ఎమ్మెల్సీని బర్తరఫ్ చేయాలని మండలి చైర్మన్ కు విన్నపం అంటూ వంగలపూడి అనిత ట్విట్టర్ లో పేర్కొన్నారు.