Bharatanatyam: భరత నాట్యాన్ని.. హిప్ హాప్ తో మిక్స్ చేసి కొట్టి మతి పోగొట్టారు.. ఇదిగో వీడియో 

  • రెండు భిన్నమైన డ్యాన్స్ లు
  • రెండూ ప్రాచుర్యం పొందినవే
  • వీటి కలయికతో కొత్త ప్రయత్నం
  • వీడియోను షేర్ చేసిన కొరియోగ్రాఫర్ ఉష
Dancers mix Bharatanatyam and Hip Hop to create amazing dance routine

ఈ మహిళలు చేసిన మిక్సింగ్ నాట్యం కొందరికి నచ్చకపోవచ్చు. కానీ అదే సమయంలో ఎంతో మంది మెచ్చేవారూ ఉన్నారు. అందుకే సంప్రదాయబద్ధమైన భరత నాట్యంలో, హిప్ హాప్ డ్యాన్స్ ను వీరు మిక్స్ చేసి కొట్టి స్టెప్పులు వేశారు. ఇలా ఎందుకు చేశారు? అన్న సందేహం రావచ్చు. దీనిని కొత్తదనం కోసం చేసిన ప్రయత్నంగానే చెప్పుకోవాలి.

వీరి నృత్యాన్ని చూస్తున్న సమయంలో భరత నాట్యం స్టెప్పుల సందర్భంలో చూడముచ్చటగానూ.. హిప్ హాప్ సమయంలో ఊర్రూతలూగించేలా ఉంటుంది. వీరు కూడా అదే కోరుకుని ఉంటారు.! నిజానికి ఈ రెండు రకాల నృత్యాలు వేటికవే ప్రాచుర్యం పొందినవి. అందుకే వీటి మిక్సింగ్ తో పాప్యులారిటీ కోసం వీరు ఓ చిన్న ప్రయత్నం చేశారంతే. కొరియో గ్రాఫర్ ఉషాజై దీన్ని ఇన్ స్టా గ్రామ్ లో పంచుకున్నారు. 

‘‘రెండు డ్యాన్స్ లను నేను ప్రేమిస్తాను. నేర్చుకుంటాను, గౌరవిస్తాను. ప్రతి డ్యాన్స్ లోని సారాంశాన్ని కొనసాగిస్తూనే.. వీటికి న్యాయం చేసేలా ఏదైనా చేయాలన్నదే నా లక్ష్యం’’ అని ఉష పోస్ట్ చేశారు. కెనడా మ్యూజీషియన్ షాన్ విన్సెంట్ స్పందిస్తూ.. ‘‘ఓ మై గాడ్.. నీవే అన్నీ’’ అని కామెంట్ పెట్టారు. (వీడియో కోసం)

More Telugu News