Naga Chaitanya: 'థ్యాంక్యూ' సినిమా టీజర్ రిలీజ్ డేట్ ఖరారు!

  • విక్రమ్ కుమార్ తాజా చిత్రంగా రూపొందిన 'థ్యాంక్యూ'
  • చైతూ సరసన సందడి చేయనున్న ముగ్గురు హీరోయిన్స్ 
  • ఈ నెల 25వ తేదీన టీజర్ రిలీజ్
  • జులై 8వ తేదీన సినిమా విడుదల  
Thank you movie release date confirmed

ఈ ఏడాది 'బంగార్రాజు' సినిమాతో హిట్ కొట్టిన నాగచైతన్య, మరో సినిమాతో పలకరించడానికి రెడీ అవుతున్నాడు. విభిన్నమైన కథాకథనాలతో రూపొందిన ఆ సినిమా పేరే 'థ్యాంక్యూ'. విక్రమ్ కుమార్ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని సమకూర్చాడు.

తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ను వదలడానికి ముహూర్తాన్ని ఖరారు చేశారు. ఈ నెల 25వ తేదీన సాయంత్రం 5:04 నిమిషాలకు టీజర్ ను రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటిస్తూ, అందుకు సంబంధించిన అధికారిక పోస్టర్ ను రిలీజ్ చేశారు. స్టైలీష్ లుక్ తో నాగచైతన్య కనిపిస్తున్న ఈ సినిమాలో రాశి ఖన్నా కథానాయికగా అలరించనుంది. 

కథ ప్రకారం ఈ సినిమాలో ముగ్గురు కథానాయికలు సందడి చేయనున్నారు. మరో ఇద్దరు కథానాయికలుగా అవికా గోర్ .. మాళవిక నాయర్ నటించారు. జులై 8వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమా తరువాత పరశురామ్ తో కలిసి చైతూ సెట్స్ పైకి వెళ్లనున్నాడు.

More Telugu News