Revanth Reddy: అయినవారికి ఆకుల్లో.. కానివారికి కంచాల్లో అంటే ఇదేనేమో!: రేవంత్ రెడ్డి

revant reddy slams  kcr
షార్ట్స్‌లో చూడండి
పంజాబ్ లో మృతి చెందిన రైతుల కుటుంబాల‌కు తెలంగాణ సీఎం కేసీఆర్ ఆర్థిక సాయం చేసిన విష‌యం తెలిసిందే. ఈ విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ కేసీఆర్ పై టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి విమ‌ర్శ‌లు గుప్పించారు. 

''అయినవారికి ఆకుల్లో కానివారికి కంచాల్లో అంటే ఇదేనేమో! తెలంగాణలో రోజుకు ముగ్గురు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఫాంహౌస్ గడప దాటి… ఒక్క కుటుంబాన్ని కూడా పరామర్శించని కేసీఆర్ పంజాబ్ రైతులకు పరిహారం ఇచ్చారు. మర్మమేమిటో మన రైతన్నలకు అర్థం కాదనుకుంటున్నారా!'' అని రేవంత్ రెడ్డి ప్ర‌శ్నించారు. ఈ సంద‌ర్భంగా కేసీఆర్ పంజాబ్ ప‌ర్య‌ట‌న‌కు సంబంధించిన ప‌లు ఫొటోలను ఆయ‌న పోస్ట్ చేశారు.
Go Back to Shorts
Revanth Reddy
Congress
KCR

More Telugu News