Hyderabad: హైదరాబాదులో దారుణం.. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ దంపతులను వేధించిన పోకిరీలు!

Software engineer wife and husband attacked by rogues in Hyderabad
  • నిన్న రాత్రి చైతన్యపురిలో రెచ్చిపోయిన పోకిరీలు
  • భార్యను వేధించిన పోకిరీలు
  • అడ్డుకున్న భర్తపై విచక్షణారహితంగా దాడి
హైదరాబాదులో కొందరు పోకిరీలు బాధ్యతా రాహిత్యంగా ప్రవర్తిస్తూ ఇతరులకు అంతులేని ఆవేదనను కలిగిస్తున్నారు. చెడు అలవాట్లకు బానిసలుగా మారిన వీరు... మత్తులో ఏం చేస్తున్నామో కూడా తెలియని స్థితిలో ఇతరులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. నిన్న రాత్రి ఇలాంటి ఘటనే మరొకటి నగరంలో చోటుచేసుకుంది.

 చైతన్యపురిలో పోకిరీలు వీరంగం సృష్టించారు. సాఫ్ట్ వేర్ ఇంజినీర్లుగా పని చేస్తున్న భార్యాభర్తలను వేధింపులకు గురి చేశారు. వివరాల్లోకి వెళ్తే, నిన్న రాత్రి డ్యూటీ ముగించుకుని ఇంటికి వస్తున్న వీరిని చైతన్యపురి రోడ్డుపై పోకిరీలు ఆపేశారు. మహిళను వేధించారు. 

ఈ క్రమంలో వారిని అడ్డుకునేందుకు భర్త ప్రయత్నించాడు. దీంతో అతనిపై పోకిరీలు ఇనుపరాడ్లు, కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన దంపతులు పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Hyderabad
Software couples
Harrassment
Attack

More Telugu News