WHO: మంకీపాక్స్ ప్రమాద ఘంటికలు.. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కేసులు

Monkeypox cases to rise globally warns WHO
  • 12 దేశాలకు పాకిన మంకీ పాక్స్ వైరస్
  • ఇప్పటి వరకు 180 కేసులు నమోదు
  • అప్రమత్తంగా ఉండాలంటూ డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక
  • జ్వరం, చలి, తలనొప్పి, శరీరంపై పొక్కులు వంటి లక్షణాలు
‘మంకీపాక్స్’ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. అమెరికా, ఐరోపా దేశాల్లో మొదలైన కేసుల ప్రవాహం నెమ్మదిగా అన్ని దేశాలను చుట్టేస్తోంది. ఆదివారం నాటికి 12 దేశాలకు ఈ వైరస్ పాకింది. మొత్తంగా 180 కేసులు నమోదయ్యాయి. యూరప్‌లోని 9 దేశాల్లో 100కుపైగా కేసులు నమోదయ్యాయి. జర్మనీ, స్పెయిన్, ఫ్రాన్స్, బెల్జియం, ఇటలీ, నెదర్లాండ్స్, పోర్చుగల్, స్వీడన్, యూకే దేశాల్లో ఈ కేసులు నమోదయ్యాయి. 

మరోవైపు, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియాల్లోనూ మంకీపాక్స్ కేసులు వెలుగుచూసినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. కేసులు క్రమంగా పెరుగుతున్నాయని, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. 

ప్రపంచవ్యాప్తంగా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు విమానాశ్రయంలోనే పరీక్షలు నిర్వహిస్తున్నారు. మశూచికి కారణమయ్యే వారియెలా వైరస్ కుటుంబానికి చెందిన ఈ మంకీపాక్స్ సోకితే పొక్కులు, జ్వరం, చలి, తలనొప్పి, కండరాల నొప్పులు, లింఫ్ గ్రంథుల వాపు వంటి లక్షణాలు కనిపిస్తాయి.
WHO
Monkeypox
India
Erope
USA

More Telugu News