10th Class: తెలంగాణలో రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు

Tenth Class exams will start from tomorrow in Telangana

  • మే 23 నుంచి జూన్ 1 వరకు టెన్త్ పరీక్షలు
  • ఉదయం 9.30 గంటల నుంచి పరీక్షలు
  • ఈసారి టెన్త్ లో 6 పేపర్లు
  • పరీక్షలు రాస్తున్న 5,09,275 మంది విద్యార్థులు

కరోనా పరిస్థితుల నేపథ్యంలో రెండేళ్ల తర్వాత తెలంగాణలో పదో తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. గత రెండేళ్లుగా పరీక్షలు లేకుండానే విద్యార్థులను ఉత్తీర్ణులను చేశారు. కరోనా పరిస్థితులు సద్దుమణగడంతో ఈసారి పరీక్షలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు జరపనున్నారు. మే 23 నుంచి జూన్ 1 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి.

ఈసారి మొత్తం 5,09,275 మంది విద్యార్థులు టెన్త్ క్లాస్ పరీక్షలు రాస్తున్నారు. పదో తరగతి పరీక్షల కోసం తెలంగాణలో 2,861 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రతి పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ద్వారా పరీక్షల సరళిని పర్యవేక్షించనున్నారు.

ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్ష జరుగుతుంది. పరీక్ష ప్రారంభం అయ్యాక 5 నిమిషాల వరకు అనుమతిస్తారు. ఆ తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైన అనుమతించరు. కాగా ఈసారి 70 శాతం సిలబస్ తోనే పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈసారి 6 పేపర్లు మాత్రమే ఉంటాయి.

10th Class
Exams
Telangana
Corona Pandemic
  • Loading...

More Telugu News