Pawan Kalyan: వనజీవి రామయ్యతో వీడియో కాల్ లో మాట్లాడిన పవన్ కల్యాణ్

Pawan Kalyan talked to Vanajeevi Ramaiah via video call
  • రోడ్డు ప్రమాదంలో గాయపడిన వనజీవి రామయ్య
  • కాలు విరగడంతో ఖమ్మం ఆసుపత్రిలో చికిత్స
  • ఫోన్ లో పరామర్శించిన పవన్ కల్యాణ్
  • త్వరగా ఆరోగ్యం సంతరించుకోవాలని ఆకాంక్ష
ప్రముఖ పర్యావరణ ప్రేమికుడు వనజీవి రామయ్య కొన్నిరోజుల కింద రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. కాలు విరగడంతో ఖమ్మం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వనజీవి రామయ్యను పరామర్శించారు. ఫోన్లో వీడియో కాల్ ద్వారా వనజీవి రామయ్యతో పవన్ మాట్లాడారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యవంతులై తిరిగి రావాలని ఆకాంక్షించారు. త్వరలోనే కలుస్తానని తెలిపారు. 

ఈ సందర్భంగా వనజీవి రామయ్య బదులిస్తూ జూన్ 5న పర్యావరణ దినోత్సవం అని, సీఎంను కలిసేందుకు హైదరాబాద్ వస్తున్నానని వెల్లడించారు. తన కుటుంబ సభ్యులను పవన్ కు పరిచయం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది.
Pawan Kalyan
Vanjeevi Ramaiah
Video Call
Road Accident
Khammam

More Telugu News