Tollywood: పిల్లలకు ఏం నేర్పుతున్నారు?.. అల్లు అర్జున్ కుమార్తె సమాధానంపై నెటిజన్ల ఫైర్

Netizens Troll Allu Arjun Daughter for her answer
  • ఇటీవల బన్నీ మామ చంద్రశేఖర్ ఇంటర్వ్యూ
  • అదే టైంలో అక్కడకు వచ్చిన అర్హ
  • నీ పేరేంటని అడగ్గా.. అల్లు అర్హ రెడ్డి అని సమాధానం
చిన్న పిల్ల అని తెలిసి కూడా అల్లు అర్జున్–స్నేహా రెడ్డిల గారాలపట్టీ అర్హ గురించి నెటిజన్లు ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారు. పిల్లలది అభం శుభం తెలియని మనస్తత్వం అని తెలిసినా.. నోటికొచ్చిన కామెంట్లు చేస్తున్నారు. ఇటీవల అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ ఓ చానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ ఇంటర్వ్యూ సందర్భంగా అర్హ తన తాతయ్య దగ్గరకు వెళ్లింది. 

దీంతో ఇంటర్వ్యూ చేస్తున్న యాంకర్.. అర్హను ‘నీ పేరేంటి?’ అని అడిగారు. దానికి ఆ చిన్నారి ‘అల్లు అర్హ రెడ్డి’ అని సమాధానమిచ్చింది. ముద్దులొలికే మాటలతో అర్హ చెప్పిన ఆ సమాధానమే నెటిజన్లకు నచ్చలేదు. కులంతో సహా పేరు చెప్పడంతో షాక్ అయ్యారు. అల్లు అర్జున్ దంపతులు వారి పిల్లలకు ఏం నేర్పుతున్నారని ప్రశ్నించారు. కులం ఫీలింగ్ లేదంటూనే తన బిడ్డకు అల్లు అర్హ రెడ్డి అని హీరో పేరు పెట్టారంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. 

సుతిమెత్తని భావాలుండే పిల్లల మనసులను ఇలాంటి వాటితో పాడు చేయడం ఏంటని నెటిజన్లు అంటున్నారు. అయితే, దీనిపై అల్లు అర్జున్ నుంచిగానీ, స్నేహ నుంచి గానీ ఎలాంటి స్పందన రాలేదు.
Tollywood
Allu Arjun
Allu Arha

More Telugu News