Bandaru Appala Naidu: జ‌గ‌న్ ఫ్లయిట్ హైజాక్ అయ్యిందా?... టీడీపీ యువ నేత బండారు సెటైర్‌!

tdp leader Bandaru Appala Naidu satires on jagan london tour
  • దావోస్ టూర్‌కు వెళ్లి లండ‌న్‌లో ల్యాండైన జ‌గ‌న్ ఫ్లయిట్‌
  • జ‌గ‌న్ లండ‌న్ ప‌ర్య‌ట‌న‌పై బండారు అప్ప‌ల‌నాయుడు సెటైర్‌
  • 'మా సీఎం ఎక్క‌డున్నారు?' అంటూ ప్రశ్న 
రేప‌టి నుంచి ప్రారంభం కానున్న వ‌ర‌ల్డ్ ఎక‌న‌మిక్ ఫోరం స‌ద‌స్సుకు హాజ‌ర‌య్యేందుకు దావోస్ బ‌య‌లుదేరిన ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌త్యేక విమానం తొలుత‌ జ్యూరిచ్‌లో కాకుండా లండ‌న్‌లో ల్యాండ్ కావ‌డంపై టీడీపీ సీనియ‌ర్ నేత బండారు స‌త్య‌నారాయ‌ణ మూర్తి కుమారుడు, టీడీపీ రాష్ట్ర కార్య‌ద‌ర్శి అప్ప‌ల నాయుడు ట్విట్ట‌ర్ వేదిక‌గా ఓ సెటైర్ సంధించారు.

'దావోస్ బ‌య‌లుదేరిన జ‌గ‌న్ విమానం లండ‌న్ దిశ‌గా హైజాక్‌కు గురవడం నిజమేనా? మా ఏపీ సీఎం జ‌గ‌న్ ఎక్క‌డున్నారు?' అంటూ ప్ర‌శ్నించారు. త‌న ట్వీట్‌కు ఆయ‌న ప్ర‌ధాన మంత్రి కార్యాల‌యం, కేంద్ర హోం మంత్రి అమిత్ షా కార్యాల‌యం, విదేశాంగ శాఖ మంత్రి జైశంక‌ర్ కార్యాల‌యం, టైమ్స్ ఆఫ్ ఇండియా, ఎన్డీటీవీల‌ను ట్యాగ్ చేశారు.
Bandaru Appala Naidu
TDP
YS Jagan
Davos
London

More Telugu News