Ram: 'బుల్లెట్' స్పీడ్ తో దూసుకుపోతున్న సాంగ్!

  • లింగుసామి దర్శకత్వంలో రూపొందిన 'ది వారియర్'
  • రామ్ సరసన సందడి చేయనున్న కృతి శెట్టి
  • 40 మిలియన్ ప్లస్ వ్యూస్ ను రాబట్టిన బుల్లెట్ సాంగ్ 
  • జులై 14న తెలుగు, తమిళ భాషల్లో సినిమా విడుదల 
The Warrierr Movie Bullet Song Response

రామ్ హీరోగా లింగుసామి 'ది వారియర్' సినిమాను రూపొందించాడు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ సినిమాలో రామ్ ఓ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ఆయన జోడీగా కృతి శెట్టి అలరించనుంది. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు. 


 ఇటీవలే ఈ సినిమా నుంచి 'బుల్లెట్ సాంగ్ ను రిలీజ్ చేశారు. కలర్ ఫుల్ సెట్ లో రామ్ - కృతి శెట్టి కాంబినేషన్లో ఈ పాటను చిత్రీకరించారు. శ్రీమణి సాహిత్యాన్ని అందించిన ఈ పాటను హీరో శింబు - హరిప్రియ ఆలపించారు. ఇంతవరకూ తెలుగు .. తమిళ భాషల్లో ఈ పాటకి 40 మిలియన్ ప్లస్ వ్యూస్ లభించడం విశేషం.



ఆది పినిశెట్టి విలన్ గా నటించిన ఈ సినిమాలో కథానాయికగా అక్షర గౌడ మెరవనుంది. నదియా .. భారతీరాజా కీలకమైన పాత్రల్లో  కనిపించనున్నారు. జులై 14వ తేదీన ఈ సినిమాను తెలుగు .. తమిళ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. రామ్ ఈ సినిమా తరువాత ప్రాజెక్టును బోయపాటి దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే.

More Telugu News