Imran Khan: మర్యం నవాజ్ పై ఇమ్రాన్ ఖాన్ సెక్సిస్ట్ వ్యాఖ్యలు.. వెల్లువెత్తుతున్న విమర్శలు!

Imran Khan sexist comments on Maryam Nawaz
  • మర్యం తన పేరును పదేపదే పలికిందన్న ఇమ్రాన్
  • మీ భర్త నిరాశకు గురవుతారని వ్యాఖ్య
  • అమ్మలు, అక్కచెల్లెళ్లు ఉన్నవాళ్లు ఇలా మాట్లాడరంటూ విమర్శలు
పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె, పాకిస్థాన్ ముస్లిం లీగ్ (ఎన్) వైస్ ప్రెసిడెంట్ మర్యం నవాజ్ పై ఇటీవల ప్రధాని పదవి నుంచి వైదొలగిన ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ముల్తాన్ ర్యాలీలో మర్యంపై ఆయన చేసిన సెక్సిస్ట్ వ్యాఖ్యలపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. 

ఇంతకీ ముల్తాన్ ర్యాలీలో ఇమ్రాన్ ఖాన్ ఏమన్నారంటే... 'సర్గోదా ర్యాలీలో మర్యం పదేపదే ఎంతో మక్కువతో నా పేరును పలికింది. ఆమెకు నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా. మర్యం జాగ్రత్తగా ఉండు. నువ్వు పదే పదే నా పేరును పలికితే నీ భర్త నిరాశకు గురవుతాడు' అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. 

ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలపై నవాజ్ షరీఫ్ సోదరుడు, పాక్ ప్రధాని షహభాజ్ షరీఫ్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ... ఈ దేశానికి కూతురైన మర్యంపై ఇమ్రాన్ వాడిన నీచమైన భాషను అందరూ ఖండించాలని అన్నారు. మీరు ఈ దేశానికి వ్యతిరేకంగా చేసిన నేరాలను మీ హాస్య చతురత దాయలేదని చెప్పారు. మస్జిద్ నవాబీ పవిత్రతను గౌరవించలేని వారు ఇతరుల తల్లులు, అక్కచెల్లెళ్లు, కూతుళ్లను ఎలా గౌరవించగలరని ఎద్దేవా చేశారు. 

ఇమ్రాన్ వ్యాఖ్యలను పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్ధారీ కూడా ఖండించారు. ఇళ్లలో తల్లులు, అక్కచెల్లెళ్లు ఉన్నవాళ్లు ఇలాంటి నీచమైన వ్యాఖ్యలు చేయరని అన్నారు. రాజకీయాల కోసం మరీ ఇంతగా దిగజారకూడదని చెప్పారు.
Imran Khan
Maryam Nawaz
Sexist Remarks
Pakistan

More Telugu News