Telangana: తెలంగాణలో జనసేన జెండా ఎగరాలి.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో క‌చ్చితంగా పోటీ చేస్తాం: ప‌వ‌న్ క‌ల్యాణ్‌

will contest in ts says pawan
  • గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లోని అన్ని స్థానాల్లో పోటీ చేస్తామన్న పవన్ 
  • పోలీసు ఉద్యోగాల వ‌యో ప‌రిమితి స‌డ‌లింపుపై నిల‌దీస్తానని వ్యాఖ్య 
  • యువ‌త బ‌ల‌మే జ‌న‌సేన‌కు ప్ర‌ధాన ఆయుధమన్న జనసేనాని 
తెలంగాణ‌లో జ‌న‌సేన పార్టీ జెండా ఎగ‌రాల‌ని జ‌న‌సేన అధినేత ప‌వన్ క‌ల్యాణ్ అన్నారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లాలో ప‌ర్య‌టిస్తోన్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఆయ‌న మాట్లాడుతూ.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లో క‌చ్చితంగా పోటీ చేస్తామ‌ని చెప్పారు. 

గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లోని అన్ని స్థానాల్లో పోటీ చేస్తామ‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. పోలీసు ఉద్యోగాల వ‌యో ప‌రిమితి స‌డ‌లింపుపై నిల‌దీస్తాన‌ని తెలిపారు. యువ‌త బ‌ల‌మే జ‌న‌సేన‌కు ప్ర‌ధాన ఆయుధ‌మ‌ని చెప్పారు. ప‌వ‌న్ ప్ర‌సంగంలోని విష‌యాల‌ను వివ‌రిస్తూ ప‌వ‌న్ క‌ల్యాణ్ రాజ‌కీయ కార్య‌ద‌ర్శి హ‌రిప్ర‌సాద్ పేరిట ఓ ప్ర‌క‌ట‌న విడుద‌లైంది.  

     
Telangana
Janasena
Pawan Kalyan

More Telugu News