Sharmila: త‌న కుమారుడు రాజారెడ్డి ఫొటోలు పోస్ట్ చేస్తూ ష‌ర్మిల ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

Congratulations on your graduation Raja says Sharmila
  • త‌న కుమారుడు రాజా రెడ్డి గ్రాడ్యుయేషన్ పట్టా అందుకున్నాడ‌న్న ష‌ర్మిల‌
  • అభినంద‌న‌లు రాజా అంటూ పోస్ట్
  • నిన్ను చూసి గర్విస్తున్నాను అంటూ ట్వీట్
త‌న కుమారుడు రాజా రెడ్డి గ్రాడ్యుయేషన్ పట్టా అందుకున్నాడ‌ని తెలుపుతూ వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి ష‌ర్మిల ట్వీట్ చేశారు. ''నీ గ్రాడ్యుయేషన్ పూర్తయినందుకు అభినంద‌న‌లు రాజా.. నా చేతుల్లో పెరిగిన నువ్వు ఇప్పుడు ఇంత‌టి వాడిన‌యినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అని ష‌ర్మిల పేర్కొన్నారు. దయార్థ హృదయంతో, నీ చుట్టూ ఉన్న వారి ప‌ట్ల ఎల్ల‌ప్పుడూ గౌర‌వభావంతో మెలుగుతూ ఉండు. దేవుడు నిన్ను ఆశీర్వ‌దిస్తాడు. నిన్ను చూసి గ‌ర్విస్తున్నాను'' అని ష‌ర్మిల పేర్కొన్నారు. ఈ సంద‌ర్భంగా ష‌ర్మిల త‌న కుమారుడికి సంబంధించిన ప‌లు ఫొటోల‌ను పోస్ట్ చేశారు.  


          

       
              
Sharmila
YSRCP
Andhra Pradesh

More Telugu News