Beeda Mastan Rao: సీఎం జ‌గ‌న్‌తో బీద మ‌స్తాన్ రావు భేటీ... రాజ్య‌స‌భ సీటిచ్చినందుకు కృత‌జ్ఞ‌త‌లు

ysrcp rajyasabha candidate beeda mastan rao meets ys jagan
  • తాడేప‌ల్లి సీఎం క్యాంపు ఆఫీస్‌కు వ‌చ్చిన బీద మ‌స్తాన్ రావు
  • వైసీపీ నుంచి రాజ్య‌స‌భ అభ్య‌ర్థిగా ఖ‌రారు
  • 2019 ఎన్నిక‌ల త‌ర్వాత టీడీపీ నుంచి వైసీపీలోకి చేరిన మాజీ ఎమ్మెల్యే
నెల్లూరు జిల్లాకు చెందిన ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త‌, మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత బీద మ‌స్తాన్ రావు గురువారం సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితో భేటీ అయ్యారు. త‌న‌కు రాజ్య‌స‌భ స‌భ్య‌త్వం ఇచ్చినందుకు ఆయ‌న సీఎంకు ప్ర‌త్యేకంగా కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఏపీ కోటాలో త్వ‌ర‌లో ఖాళీ కానున్న 4 రాజ్య‌స‌భ స్థానాల‌కు న‌లుగురు అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేస్తూ వైసీపీ రెండు రోజుల క్రిత‌మే ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. 

ఈ నేప‌థ్యంలోనే త‌న‌ను రాజ్య‌స‌భకు పంపేందుకు నిర్ణ‌యం తీసుకున్న జ‌గ‌న్‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపేందుకే మ‌స్తాన్ రావు గురువారం తాడేప‌ల్లి క్యాంపు కార్యాల‌యానికి వ‌చ్చారు. టీడీపీతో రాజ‌కీయ జీవితాన్ని ప్రారంభించిన మ‌స్తాన్ రావు... 2019 ఎన్నిక‌ల త‌ర్వాత టీడీపీని వీడి వైసీపీలో చేరిన సంగ‌తి తెలిసిందే. పార్టీలో చేరిన అనతికాలంలోనే ఆయ‌న ఏకంగా రాజ్య‌స‌భ స‌భ్య‌త్వాన్ని ద‌క్కించుకోవ‌డం గ‌మ‌నార్హం.
Beeda Mastan Rao
YSRCP
YS Jagan

More Telugu News