తెలంగాణలో పెరిగిన మద్యం ధరలు... దేనిపై ఎంత అంటే..!
- బీరుపై రూ.20 పెంపు
- క్వార్టర్ బాటిల్‌పై రూ.20 పెంపు
- రూ.80 పెరిగిన మద్యం ఫుల్ బాటిల్ ధర
- రేపటి నుంచే అమల్లోకి పెంచిన ధరలు
పెంచిన ధరలు రేపటి (మే 19) నుంచే అమల్లోకి రానున్నాయి. మద్యం ధరలను పెంచిన నేపథ్యంలో నేటి రాత్రి మద్యం విక్రయాల గడువు ముగియగానే... ఆయా దుకాణాల్లోని మద్యంను అధికారులు సీజ్ చేయనున్నారు. ఆపై గురువారం నుంచి పెరిగిన మద్యం రేట్లను అమలులోకి తీసుకువస్తారు.