తుగ్లక్ కూడా నవ్వుకునేలా జగన్ పాలన: మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనపై కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీర శివారెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. అక్రమాస్తుల కేసుల నుంచి బయటపడేందుకు జగన్ రాజ్యసభ సీట్లను అమ్ముకున్నారని ఆయన ఆరోపించారు. జగన్ పాలన చూస్తే తుగ్లక్ కూడా నవ్వుకునేలా ఉందని కూడా ఆయన ఎద్దేవా చేశారు. ఈ మేరకు బుధవారం కమలాపురంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వైసీపీ రాజ్యసభ సీట్ల కేటాయింపుపై ఆయన విమర్శలు గుప్పించారు.
వైసీపీ రాజ్యసభ సీట్లకు ఎంపిక చేసిన ఆర్. కృష్ణయ్య, నిరంజన్ రెడ్డిలు ఏ రాష్ట్రానికి చెందిన వారని ప్రశ్నించిన వీర శివారెడ్డి... వారు ఏపీలోని ఏ జిల్లాకు చెందిన వారో చెప్పాలని డిమాండ్ చేశారు. వైసీపీలో రాజ్యసభకు వెళ్లే అర్హత కలిగిన నేతలు లేనందుననే జగన్ రెండు సీట్లను తెలంగాణకు చెందిన వారికి కేటాయించారని విమర్శించారు. 2024 ఎన్నికల్లో జగన్‌కు బుద్ధి చెప్పేందుకు ఏపీ ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు.